హాయ్! నా పేరు **గుండా స్వప్తిక**. ఈ కథ ఆకాశం నీ హద్దు రా నా హృదయపు అంతరంగాల నుండి వెలిసిన కల. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు; ప్రతి సాధారణ కుటుంబంలో పుట్టిన సాధనమయిన అమ్మాయికి అంకితమైన నిబద్ధత గాధ. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాను. కానీ చిన్నప్పటి నుంచీ కథలు వ్రాయడంలో స్పూర్తినిచ్చే జీవిత గాథలను వెలికితీయడంలో ఎంతో ఆసక్తి ఉండేది. ఈ పుస్తకం ద్వారా ఓ మామూలు అమ్మాయి ఎలా తన కలల్ని సాకారం చేసిందో ఎంత కష్టాలు ఎదురైనా ఎలా లొంగకుండా ముందుకు సాగిందో చూపించడానికి ప్రయత్నించాను. ఈ కథలో ఉన్న ప్రతి భావం. ప్రతి మలుపు... నిజ జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవి. నా కల నా భావాలు నా కలల పందా ఈ పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కథని చదివిన ప్రతి యువతీ యువకుడికి నీ కలలు నిజమవుతాయి నీవు వాటికి న్యాయం చేస్తే అనే ఆశను నింపగలగాలని ఆశిస్తున్నాను.మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను. నా కథ మీ గుండెను తాకితే అదే నాకు నిజమైన పురస్కారంప్రేమతో**గుండా స్వప్తిక**
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.