పడిన శిక్ష చేసిన తప్పుకి కర్మ ఫలితం అయితే మరి చేసిన తప్పు దేనికి ఖర్మ ఫలితం?

తప్పు ఒప్పు అనే పదాలకి నిజంగా అద్వైత అర్థాలు ఉన్నాయా? నిజం అనేది మనం చూసేదా? వినేదా? జరిగేదా? లేక నమ్మేదా?

కారడవి మధ్యనున్న సైంధవభవనం అనే జైలుకు కొత్తజైలరు వచ్చాడు. జైలును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్న అతనికి వచ్చీరాగానే ఫారెస్ట్ ఆఫీసర్ నుండి వచ్చిన ఫోన్ కాల్ తో మొదలయిన ఒక సమస్య ఇద్దరు ఖైదీల జీవితాలతో ఎలా ముడిపడింది? ఆ ఖైదీలు అసలు ఎందుకు మాట్లాడుకోరు? ఎందుకు గొడవపడుతున్నారు? వారిని కలపక తప్పని పరిస్థితిని జైలరు ఎలా అధిగమించాడు?

జైలుకు రాక ముంది జరిగిన ఒక సంఘటన ఈ ఖైదీల జీవితాలను ఎలా మార్చేసింది? మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడితే బయటపడే నిజాలు ఊహకు కూడా అందకపోతే?

ఇదంతా చాలా దెగ్గరగా వీక్షించిన ఆ జైలు గోడ ఉండబట్టలేక మనకి చెప్పే కథే ఈ 'సైంధవభవనం లో సూర్యగ్రహణం'.

Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.