దళితులపై వివక్ష అనేది భారతీయ సమాజంలో చాలా కాలంగా నిరంతరాయంగా కొనసాగుతున్న సమస్య. జాతి వ్యవస్థ ఆధారంగా దళితులను తీవ్రంగా వెలివేయడం వారిపై అత్యాచారాలు హింస వేధింపులు జరగడం వారి పట్ల అవమానజనక ప్రవర్తన చాలా సాధారణమైన విషయాలైపోయాయి. విద్య ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో దళితులను వెనుకబడిన వర్గాలుగా చిత్రీకరించడం వారికి సమాన అవకాశాలు లేకపోవడం పైగా వారిని నానా రకాల అణచివేతలకు గురి చేయడం వంటివి భారతదేశంలో అనేక ప్రాంతాలలో జరుగుతూనే ఉన్నాయి. కులవ్యవస్థ పట్ల పోరాడడానికి విద్య ఎంత అవసరమో దళిత యువతీయువకులు ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని బతకడానికి తమ హక్కుల పట్ల అవగాహన ఎంత అవసరమో అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. 1970లలో జరిగే ఈ కథలో ఒక మారుమూల పల్లెటూరికి ప్రభుత్వ ఉద్యోగిగా వస్తాడు సెబాస్టియన్ రాజు. తను కలలు కన్న జీవితం పరిస్థితుల ప్రభావంతో అతనికి అందిన జీవితం ఈ రెంటి మధ్య దూరాన్ని చెరపాలనే అతని కోరిక తన కలను సాధించుకునే దిశలో రాజు చూపించిన రెసిలియన్స్ ఈ నవలలో రచయిత ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. కులవ్యవస్థ అతని మీద విధించే అదృశ్య సంకెళ్లను ఛేదించడానికి విద్యను అస్త్రంగా ఉపయోగించుకుని తన హక్కుల కోసం పోరాడతాడు. దళిత ఆత్మ గౌరవాన్ని ఎత్తి చూపించే నవల ఇది.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.