*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹300
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
అతడొక కవిత్వ మాంత్రికుడు.</br>
కుంచెని కెమెరా లెన్సుని కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చాడు. రెండు దశాబ్దాల కింద మూగబోయిందతని శరీరం. కానీ కవిత్వం మాత్రం గోడలపై నినాదాలై వ్యాసాలకు మొదలు తుదలై ప్రజల నోటి నుడికారమై మన మధ్యే తచ్చాడుతున్నది.</br>
శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా కోట్ అయిన కవిత్వం ప్రభాకర్. వర్తమాన కవిత్వానికి కాయినేజ్ పెంచిన కవీ ఇతనే. రూపంలో సంక్షిప్తతనీ వస్తువులో జీవిత విస్తృతినీ సమాజపు లోతుల్నీ ఇమిడ్చాడు. సమాజ మార్పుని ఆకాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి. మరణం నా చివరి చరణం కాదని సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించాడు. రోజు రోజుకీ అతని కవిత్వానికి రెలవెన్స్ పెరుగుతోంది. అందుకే ఈ</br>
ప్రచురణ!</br>
-జయధీర్ తిరుమలరావు