ప్రతి మనిషి జీవితంలో రకరకాల అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలే ఆ మనిషికి నేర్చుకున్నన్ని జీవితపాఠాలనూ నేర్పిస్తాయి. ఎవ్వరికైనా నిరాకారము నిర్గుణము ఐన ఆ అనుభవాలతో జతకట్టక తప్పదు. యాదృఛ్ఛిక అనుభవాలే కాక కొన్ని కోరికలను తీర్చుకునే నేపథ్యంలోనో లేదా కొన్ని గమ్యాలను చేరుకునే నేపథ్యంలో కూడా ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. అలాంటి అనుభవాలకి ఒక నెచ్చెలి రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుంది? నిజమే అనుభవాలు నిరాకారాలూ నిర్గుణాలే. కానీ అవి మనలో ఎన్నో వికారాలకు కారణమవుతాయి. కానీ అవే అనుభవాలను నిర్మలమైన మనసుతో చూస్తే ఏ దిశా లేని మనకు తోడుగా ఉండి మన జీవితానికి దిశా నిర్దేశం చూపే ఒక స్నేహితురాలు మనకి తప్పక దర్శనమిస్తుంది. కొందరి జీవితాలకు ఆ నెచ్చెలి అందించిన ఆ దిశకు అక్షరరూపమే ఈ అనుభవాల నెచ్చెలి. విజయాలు చిన్నవి కావచ్చు లేదా పెద్దవీ లోకమంతా గుర్తించేంత గొప్పవీ కావచ్చు. కానీ ఈ పుస్తకంలో మాత్రం చిన్న విజయాలు సులభసాధ్యాలు లేదా కొంచెం కష్టసాధ్యాలైన విజయాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాంటి సామాన్య విజయాలతో పాటు మన సమాజంలోని కొన్ని చీకటి కోణాలను “వీటికి పరిష్కారమే ఉండదా” అనేలాంటి కొన్ని జటిల సమస్యలనూ పాఠకుల ముందుంచి వాటికి సమాజంలోని కొందరు బాధితులు సూచించిన పరిష్కారాలను ఈ పుస్తకం కొన్ని కథల సహాయంతో ఏకరువు పెడుతుంది. నిజానికి సమస్యల ఉచ్చులో చిక్కుకున్న వారు దానిలోంచి బయట పడి మమూలు జీవనం సాగించడం కూడా చెప్పుకోదగ్గ విజయమే. అలాంటి సామాన్యుల అసామాన్య విజయాలూ ఆ క్రమంలో వారెదుర్కున్న అనుభవాలూ సమాజంలోని చీకటి కోణాలకు కొందరు సూచించిన పరిష్కారాలూ సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కూడా ఆశావహ ధోరణిని వీడక ముందుకి అడుగులేసిన వారి అనుభవాలూ ఇలా సమాజంలో మనం సాధారణంగా భావించే అసాధారణ అనుభవాలు ఇవే ఈ పుస్తకంలోని కథాంశాలు.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.