భక్తి ఎవరిదగ్గరైతో ఉంటోందో, వారిదగ్గరే భగవంతుడు ఉంటాడు. దేవుళ్ళు, దేవతలు, ఎల్లప్పుడూ దైవ భక్తిపరులను కాపాడుతూ ఉంటారు. భక్తి ఉన్నవారికి, భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుంది. భక్తియున్న వారికి, మనసు ప్రశాంతముగా ఉంటుంది. భక్తిపరులకు, దైవబలం కూడా ఉంటుంది. భక్తితో పురాణాలు చదివినవారికి, పుణ్యం కూడా లభిస్తుందని మన వేద పురాణాలలో చెప్పబడి ఉన్నది. అసలు మనిషి జన్మ గా పుట్టడమే ఒక దేవుడిచ్చిన వరంగా అనుకోవాలి. ఇలాంటి మానవ జన్మని సార్ధకం చేసుకోవాలంటే, ప్రతీ మనిషి భక్తితో పాటు దైవాన్ని కూడా పూజించినచో, పుణ్యంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తున్నాము. పురాణాలు, రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలు చదివిన గానీ, విన్నవారికి గాని, భక్తి ప్రపంచంలో ఉండి, దేవుని మీద భక్తి కలిగి ఉండి, దైవ ప్రార్ధనలో ఉండి, పుణ్యం, మోక్షం తప్పక సంపాదించుకోగలరు. మానవ జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం అనేది కూడా తెలుసుకోగలరు. పురాణాల విషయాలు, విశేషాలు, వీటి ప్రాముఖ్యత, ప్రతీవారు తెలుసుకొన్నచో, జ్ఞ్యానోదయం కూడా కలిగి, మనిషి జీవితాన్ని సార్ధకం చేసుకోగలరు. కావున, ఈ 18 పురాణాల విషయాలను, అనేక సంబంధిత విశేషాలను, ప్రతీ వారికి క్లుప్తంగా అర్ధం అయ్యే విధంగా, అనేక రాకాలుగా అనేక విషయాలను సేకరించి, రీసెర్చ్ చేసి, వ్రాసి, సొంతంగా అనేక విషయాలను జోడించి, అనేక పురాణాల పుస్తక గ్రంథాలను చదివి, వాటిలోని ముఖ్యమైన ఘట్టాలను, కథలను, సొంత శైలిలో వ్రాసి, మీ ముందు ఉంచుతున్నాము. ఈ పురాణాలను అందరూ చదివి, జ్ఞ్యానం పెంచుకొని, భక్తిమార్గంలో పయనిస్తారని, ఆసిస్తూ ...