Good Vibes Good Life

About The Book

ఈ పుస్తకం ప్రపంచం ముందు మీరు అత్యంత శక్తివంతునిగా, ప్రభావవంతమైన వ్యక్తిగా నిలబడటం ఎలాగో వివరిస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలి? ప్రతికూలమైన ఆలోచనలను ఎలా సానుకూలంగా మలుచుకోవాలి? శాశ్వతమైన సంతోషాన్ని సొంతం చేసుకోవటానికి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి అనే విషయాలను మీరు తెలుసుకోవచ్చు. అలాగే భయాన్ని జయించి విశ్వంతో పాటు ప్రవాహగమనంతో సాగటం, సానుకూలమైన జీవనశైలి అలవాట్లను అలవరచుకోవటం, ధ్యానం, జాగృదావస్థలను జీవితంలో భాగం చేసుకోవటం వంటి అంశాలపై అవగాహన పెంచుకోగలుగుతారు. మీ శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చుకోవటం, స్వీయ జాగ్రత్తలు పాటించటం, విషపూరితమైన శక్తిని అధిగమించటం గురించి తెలుసుకోగలుగుతారు. ‘‘జీవితంలో గొప్ప అవకాశాలను సొంతం చేసుకోటానికి మీ నమ్మకాలను మార్చుకోండి. లక్ష్యం ఏదైనా దాన్ని వ్యక్తీకరించండి, ప్రయత్నిస్తే ఫలితమిచ్చే మార్గాలను ఆచరించండి. మీ అత్యున్నతమైన ఆశయాన్ని గుర్తించండి. ఇతరులకు దీపధారిలా నిలవండి’’ అన్న సూచనలు లభిస్తాయి. మీ ఆలోచనలు, భావనలు, మాటలు, పని విధానాల్లో గనక మార్పులు చేయగలిగితే మీరు ప్రపంచాన్నే మార్చగలరనే జీవనసత్యం మీకు అర్థమవుతుంది. . ABOUT THE AUTHOR . వెక్సుకింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రభావం చూపే వ్యక్తి, రచయిత, మనోనిపుణుడు, జీవనశైలి వ్యాపారవేత్త. అతను ఎదుగుతున్న దశలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. పసిపిల్లవాడిగా ఉండగానే తండ్రిని కోల్పోయాడు. అతని కుటుంబం తరచూ ఇల్లు లేని పరిస్థితిని ఎదుర్కొంది. ప్రమాదకరమైన ఇరుగుపొరుగుమధ్య ఇరుకైన జీవితాన్ని గడపవలసి వచ్చింది. అతను ఎన్నోమార్లు జాత్యంహకారాన్ని ఎదుర్కొన్నాడు. ఇలాంటి విషమ పరిస్థితుల మధ్య వెక్సు తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నాడు. అతను ప్రస్తుతం సాధికారతనివ్వగల జీవనశైలి బ్రాండు బోన్ విటాకు సొంతదారు. ఇది సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపదలుచుకున్నవారు ఎవరికైనా సానుకూలతను ఇచ్చే కేంద్రంగా నిలిచింది. ప్రాచుర్యం పొందిన ఇన్ స్టాగ్రామ్ ఎక్కౌంట్ (@vexking) ద్వారా వేలాది మందికి అతను ప్రేరణ కలిగిస్తున్నాడు. అతను ఒక చైతన్య కార్యక్రమానికి నాంది పలికాడు. Good vibes Only #GVO ద్వారా , సానుకూల శక్తిని ఉపయోగించి తమను, తమ జీవితాలను ఉత్తమంగా మలుచుకోటానికి సహకరిస్తున్నాడు.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE