*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
దేశానికి ప్రజలకు ఎక్కువగా హాని కలిగించే రీతిలో ఈ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగ ఆంతరంగిక కూటమి పోలీస్ నాయకత్వాన్ని పరిమితం చెయ్యడం నేను గమనించాను. దాని పరిణామాలనే అందరూ అనుభవించడం యివాళ మనం చూస్తున్నాం. ప్రజలలో ఇండియన్ పోలీస్ పట్ల అవిశ్వాసం విపరీతంగా పెరిగిపోయింది.<br>కొంతమంది అదికారులచే పోలీస్ సంస్కరణలు (భారత సుప్రీమ్ కోర్ట్ తీర్పు ననుసరించి అమలుచరపవలసినవి) ఏవిధంగా విధ్వంసమయ్యాయో ప్రత్యక్ష కథన రూపంలో విస్పష్టంగా ఎలాంటి మినహాయింపు లేకుండా సవరించబడి ఆధునీకరించబడిన ఈ ప్రతిలో పొందుపరచ బడ్డాయి.<br>ఈ విధమైన విధ్వంసం మూలాలనే కదిలించే విధంగా వీరు తమ ప్రవర్తనను కఠినంగా మార్చుకునేలా దోహదం చేసింది. చాలాకాలం (అంటే 35 సంవత్సరాలు) ప్రశంసాపూర్వకమైన సేవలు చేసిన కిరణ్ బేడీ పదవీ విరమణచెయ్యడానికి నిర్ణయించుకున్నారు. వ్యవస్థను తమ గుప్పెట్లో బానిసగా వుంచుకునేవారితో కలసి పనిచెయ్యడం సాధ్యంకాదని విశ్వసించారు. ఈ విధమైన విధ్వంసక బృందం చేతిలో బానిసగా పనిచెయ్యకూడదని మనసులో ధృఢంగా నిశ్చయించుకున్నారు.. అలాంటి వారు నైతిక విలువలను దిగజార్చి మనుషులలోని స్పూర్తిని హరించి వారిని మరుగుజ్జులుగా తయారుచేసే దిశలో నాయకత్వాన్ని నిర్దేశించడం తప్ప మరేం చెయ్యగలరు. అలాంటి బూటకపు చరిత్రలో పాలుపంచుకోవడం వారికి యిష్టంలేదు.<br>‘నా ఆత్మాభిమానం న్యాయంపట్ల నాకున్న స్వతసిద్ధమైన భావన జీవితం పట్ల నాకున్న విశ్వాసం విలువలే- నా అభివృద్ధికి యిప్పటికీ అవరోధం కలిగిస్తున్న 'బానిసత్వా'న్ని తిరస్కరించేలా ప్రేరేపించాయి. యిప్పుడు నేను నా జీవితాన్ని నాకిష్టమైన రీతిలో మలచుకోవడానికి నాకై నేను స్వేచ్ఛగా జీవించడానికి నిర్ణయించుకున్నాను'- అని అంటారు వీరు.<br>సజీవమైన ఉత్సాహం ధైర్యసాహసాలతో ఆద్యంతం ఆసక్తికరమైన వ్యాఖ్యానంతో రూపొం దించబడిన పుస్తకం ఇది.