మాడభూషి ప్రఖ్యాతి చెందిన ఇంటిపేరు. సంపత్] కుమార్] తనకు తానుగా దిద్ది తీర్చుకున్న పేరు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రీయులకు చెన్నైలో తెలుగు అనగానే మాడభూషి సంపత్] కుమార్] గారే గుర్తొస్తారు. మద్రాసు యూనివర్సిటీని ఆలంబనగా చేసుకొని వారు నిర్వహించిన సదస్సులు గోష్ఠులు కవి సమ్మేళనాలు అటు ఆన్]లైన్]లోనూ ఇటు వేదిక మీదా ఇక్కడున్న మాలాంటి వాళ్ళను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. చైతన్యమునెవరైనా చేతులు కట్టుకు కూర్చొమ్మనునా అని సినారె అన్నది ఇలాంటి వారిని చూసే. స్థిర జీవితానికి కొంత ఆలస్యం జరిగినా నిజస్థిరత్వం సాహిత్యంలోనే ఉందన్న విషయాన్ని మాడభూషి గారు ముందే గుర్తించారు. విద్యార్థిగా మొదలుపెట్టిన పరిశోధనను జర్నలిస్టుగా ఆచార్యులుగా విశ్రాంత జీవిగా కూడా కొనసాగిస్తున్నారు. అరడజను పరిశోధన గ్రంథాలు అరడజను అనువాదాలు సంపాదకక్రియలతో పాటు తమదైన ముద్రతో ఆరు కవితా సంపుటాలు కూడా ప్రచురించడం చిన్న విషయం కాదు. ఈ పెద్ద విషయమే కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి గారిని ఆకర్షించింది. -డాక్టర్] ఏనుగు నరసింహారెడ్డికవిపేరు చెప్పకుండా కవిత్వమై కురిశాడని చెప్పటం ద్వారా శీర్షికతోనే ఒక ఉత్సుకతను కలిగింపచేశారు కొండ్రెడ్డి గారు. స్వయంగా కవి కావడం వల్ల ఎదుటి కవి హృదయాన్ని అర్థం చేసుకొని విశ్లేషించి వివరించగల నేర్పు సొంతం చేసుకొన్నారు. విమర్శకుడు కవి కూడా అయితే ఆ విమర్శ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పటానికి ఈ కవిత్వమై కురిసిన కవి అనే పుస్తకమే సాక్ష్యం. -డాక్టర్] గుమ్మా సాంబశివరావు
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.