*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹160
₹260
38% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజగారి మధువనంలో విహరిస్తూంటే పూల పరిమళాలు పిల్ల తెమ్మెరలు నన్ను పలుకరించాయి. కథలన్నీ ఒక కావ్య ప్రయోజనాన్ని సిద్ధింప జేసుకుని హమ్ కిసీ సే కమ్ నహీ అంటూ గర్వంగా తలెత్తుకుని సాహితీ వేదికపై నిలబడ్డాయి.శైలజ కథలు ఏవో టైంపాస్ బటానీలు కావు. ప్రతి కథ వెనుక రచయిత్రిదైన సోషల్ కమిట్]మెంట్ వుంది. Poetry Instructs as it delights అని డాక్టర్ జాన్సన్ అన్నట్లుసమాజానికి సందేశమిస్తూనే మనసులను అలరింప చేసే కథలవి.మేధావుల వలసను ఇతివృత్తంగా తీసుకొని మలచిన కథ స్నేహానికన్న మిన్న. ఆంధ్రోళ్ళు తెలంగాణావారిని దోచుకున్నారని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అపోహకు గురైన తెలంగాణా యువకుడు ఆంధ్రా తెలంగాణావాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగాలన్నీ తమ కైవసం చేసుకుంటున్నారన్న అక్కసుతో అక్కడివారు వారిపైదాడులు చేయడం చూసి నిజాన్ని తెలుసుకుంటాడు. గట్స్ ఉంటేగాని ఇలాంటి థీమ్స్ రాయలేరు శైలజకు ఆ గట్స్ ఉన్నాయి.హాస్యాన్ని పండించడం రచయితకు కత్తిమీద సాము. మా శైలజ సవ్యసాచి. ఎంత ఘాటు ప్రేమయో కథలో పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదనే లోటును ఇద్దరు భార్యాభర్తలు ఎలా కలర్ ఫుల్గా తీర్చుకున్నారో తెలిసి నవ్వుకుంటాం బిగ్గరగా. ఆరోగ్యకరమైన హాస్యం! జబర్దస్త్ లాంటి వెకిలి లైవ్]షోల వాళ్ళు ఇలాంటి చక్కని హాస్య కథలను స్కిట్]లుగా మార్చి ప్రేక్షకులకందిస్తే బాగుంటుంది. పాణ్యం దత్తశర్మ వనస్థలిపురం హైద్రాబాద్