MARKANDEYA A NOVEL
Telugu


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

క్రైమ్ ఫిక్షన్ అనేది కేవలం నేరాన్ని మాత్రమే కాదు ఆ సంఘటన వెనుక దాగి ఉన్న సంక్లిష్టమైన మానవ మనస్తత్వాన్ని మరియు వ్యవస్థలోని లోపాలను శోధించేందుకు దొరికిన ఒక అరుదైన అవకాశం అంతులేని అధికారం అపారమైన సంపద పటిష్టమైన రక్షణ వలయం కలిగిన శక్తిమంతమైన క్రిమినల్ కత్తిదాను. అతడికి అనుచరులు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వేటాడే కుక్కలు ఉన్నప్పటికీ అత్యంత భద్రత కలిగిన తన ఇంట్లోని తోటలో దారుణంగా చనిపోతాడు. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ఏసీపీ రంజితక్కు... కత్తిదాస్ గుండెపోటుతో మరణించాడని పోస్టుమార్టం నివేదిక సూచిస్తున్నా దాని వెనుక ఎవరో కృత్రిమంగా ఒత్తిడి కలిగించి చంపి ఉంటారనే బలమైన అనుమానం కలుగుతుంది. అయితే ఈ హత్యకు సంబంధించిన రహస్యం యొక్క చిక్కుముడి జైలులో కఠిన కారాగారశిక్ష అనుభవిస్తున్న ఒక ప్రమాదకరమైన నేరగాడి వద్ద ఉంది అతడే ‘మార్కంండేయ! హెూంమంత్రి లక్ష్మీపతిరావు ఇంకా ఇతర ఉన్నతాధికారులు పకడ్బందీ కుట్రతో ఇరికించి జైలుకు పంపించిన మార్కంండేయ చేతికి వారి గుట్టు ''రెడ్ డైరీ'' రూపంలో చిక్కుతుంది. అమాయకులను ఆత్మీయులను బలి తీసుకున్న వ్యవస్థపై నిజమైన రాక్షసులపై పగ తీర్చుకోవడానికి తనను తాను తిరుగులేని ఆయుధంగా మార్చుకోగల మార్కంండేయ పెరోల్ పై బయటకొస్తాడు. ఒకవైపు అధికారం ద్రోహం మరోవైపు హత్యల రహస్యం మధ్య తనను వేటాడుతున్న శత్రువుల పద్మవ్యూహాన్ని అతను ఎలా ఛేదిస్తాడు? చట్టాన్ని ఉల్లంఘించిన నేరస్తుడే న్యాయం కోసం వేట మొదలుపెడితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుంది? తెలుసుకోవాలంటే ''మార్కాండేయ'' నవల చదవాల్సిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఒక నేరగాడి మానసిక సంఘర్షణ ప్రతీకారం అసాధారణమైన మేధస్సు చుట్టూ అల్లబడిన ఉత్కంఠభరితమైన నవల.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details