<p>ఏమిటి? కార్టూన్ పుస్తకం తెరిచి ముందు మాట కూడా చదవాలనుకుంటున్నారా? భలే. మీరు అసలు సిసలైన జిజ్ఞాసువు.</p><p>వర్చస్వి బొమ్మలు 'మాట్లాడతాయి'. కొన్ని కార్టూన్లు 'అల్లరి' కూడా చేస్తాయి. ఈ పుస్తకంలో ప్రతి బొమ్మ ఒక 'కథ' చెప్తుంది. పాఠకులు ముచ్చటపడతారు. పెద్దలు ఎప్పుడో మరిచిపోయిన తమ నవ్వును గుర్తు చేసుకుంటారు.అవును. ఈ పుస్తకం మిమ్మల్ని చిన్న పిల్లగాడిని చేస్తుంది.</p><p>కనుబొమ్మలపై బొమ్మలు నాట్యం చేస్తుంటే...వేడి కాఫీ తాగుతూ మొదటి పేజీ తెరవండి. భోజనం వరకు నవ్వుతూనే ఉంటారు. అలా ఈ పుస్తకం మీ పెదవులపై చిరునవ్వు చిందించాలని కోరుకుంటున్నాను.</p><p>ఇక ఆలస్యం దేనికి? నవ్వుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.</p>
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.