రెండు వేల ఏళ్ళ పైబడిన ప్రాచీన భారతీయ సాహిత్య వైభవం ఈ పుస్తకపు పుటలలో మీకోసం ఎదురుచూస్తున్నది. గాగర్ మే సాగర్ భర్నా (గంగాళంలో సముద్రాన్ని నింపడం) వంటి ప్రయత్నం ఇది. అపురూపమైన దృశ్యచిత్రాల సంపుటం ఈ పుస్తకం. దృశ్యాలేనా? శబ్దాలు వాసనలు చిన్న చిన్న కదలికలు సుదీర్ఘప్రవాసాలు ఋతుచక్రభ్రమణాలు - ఇంద్రియగ్రాహ్యమైన ప్రపంచపు సూక్ష్మరూపం ఒదిగివున్నది ఈ పుస్తకంలో. మానధనులూ దానశీలురూ అయిన రాజులు వీరులు వేటగాళ్ళు రైతులు సముద్రపతులుగా సంబోధించబడే నావికులూ జాలరులూ పర్వతరాజులూ వనదేవతలూ చెడుతోవలు తొక్కే మొగుళ్ళూ వాళ్ళను చెవి మెలేసి అదుపులోకి తెచ్చుకోగల ధీరభార్యలు జొన్నచేలలో మంచె మీదికెక్కి చిలుకలను తోలే జానపదకాంతలు జాణలు ముగ్ధలు సురతానందాభివ్యక్తులు విరహపు నిట్టూర్పులూ కన్నీళ్ళూ ఏనుగులు ఎద్దులు లేళ్ళు పావురాళ్ళు సెలయేళ్ళూ కలువలూ ఆవపొలాల పక్కన చలికాచుకునేందుకు వేసిన నెగళ్ళూ ఉన్నాయి.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.