*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
ఇక్కడ ఏదో ఒకటి జరిగి దానికి పీటముడివేసి ఇంకేదేదో జరుగుతూ సాగుతుంది. కాని నవల ఉన్నది జరిగినదాని గురించో లేదా జరిగిందని గ్రహించినదాని గురించో లేదా జరగదగిన అవకాశాల గురించో ఇలాంటి ప్రశ్నలు ఈ నవలలో పాఠకుడు అనే విక్రమాదిత్యుడిని బేతాళుల్లాగా వేధిస్తాయి. అలాగే కథ కనిపించే తీరు మూలకంగా పాఠకులకు – స్వతః లోకమే అలా వుండవచ్చునా, స్థిరమూ, నిశ్చితమూ అని మనం భావించే ఈ జీవన వ్యాపారాలు కేవలం మనోనిర్మితాలేనా? – అనే ఒక అనుమానం ఉద్భవిస్తే అది కాకతాళీయం కాకపోవచ్చునేమో?