ఇటీవలి కాలంలో తెలుగులోనూ Sexuality కి సంబంధిచిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్దాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. Sexuality ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల కోణంలోనే చూస్తున్నప్పుడు “వాటిని గురించిన సాహిత్య వ్యక్తీకరణా ఆ సమూహం వాళ్ళే చేయాలా? లేదూ ఆ విషయం తెలిసిన బయటి వారు ఎవరైనా చేయవచ్చా?” అనేది ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న. అయితే, ఆ సమూహంలోని వ్యక్తులే ఆ విషయాలను సాహిత్యంలోకి తీసుకునివచ్చినప్పుడు వ్యక్తమయ్యే Pain ని బయటి వారు తీసుకుని రాలేరు అనేది సత్యం. Pain ఒక్కటే సాహిత్యం అవ్వదు గనుక, సాహిత్యం తెలిసిన వారు లేదా రాస్తున్నవారు చేసే వ్యక్తీకరణ Empathetic గా ఉంటుంది. ఇది అట్లా బయటి సమూహం నుండి రాసిన నవల. అయితే, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం వచ్చిన తొలినాళ్లలో దాన్ని సాహిత్యంగా గుర్తించ నిరాకరించడమూ, మౌనం పాటించడమూ మనకు తెలుసు. ఇప్పుడు Sexuality మీద వస్తున్న సాహిత్యం పట్లా అదే మౌనం కనబడుతోంది. ఇది ఆ మౌనాన్ని బద్దలుకొట్టే ‘నవల’ అని మేం భావిస్తున్నాం. సాహిత్యంలోకి దీన్ని కొత్త చేర్పుగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి. చర్చల్లోకి.” – అరుణాంక్ లత (సంపాదకుడు, Chaaya Books)
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.