*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹293
₹330
11% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
15 సంవత్సరాల క్రితం ఓ పత్రికలో ఓ పెద్దాయన డైలీ న్యూస్ పేపర్ సాహిత్య పేజీలలో.. సాహితీ లోకంలో...కథ..పని అయిపోయిందిఅటక ఎక్కేసింది..అంటూ వ్యాసం రాశారు..కథ గురించి వినరాని మోటు పదం ఆయన వాడారు.ఆ తర్వాత కూడా ఒకరిద్దరూ అదే రకంగా రాశారు. అప్పటికే నేను రమారమి 250 కథలు రాసి చాలా విజయాలు సాధించి ఉన్నాను. కానీ కథ మనుగడ గురించి వాళ్ళ వివరణ చదివాక..కథ పనిఅయిపోయిందా అంటూ భయపడ్డానుబాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కరెక్టే అనిపిస్తుంది. రచయితల విషయంలో..పత్రికల యాజమాన్యాలు ప్రచురణ సంస్థల అధిపతులు చివరికి కథలను చదివే పాఠకులు కూడా...పట్టించుకోవడం మానేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. తర్వాత నెమ్మదిగా పరిస్థితులు చక్కబడి కథ పునర్ వైభవాన్ని సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది. ప్రస్తుతం చాలా ప్లాట్ ఫామ్ లు కథను అభిమానిస్తున్నాయి. అఖండఖ్యాతిని అందిస్తున్నాయి. కథలను చదివే పాఠకులు కూడా పెరిగారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కొన్నాళ్లకి సినిమాలు చూడటం మానేసి కథలే చదువుతారేమో అనిస్తుంది.ఈ రోజున కథ... హిమాలయ పర్వతాల మీద విహరిస్తోంది విమానం కన్నా వేగంగా దూసుకుపోతోంది సన్నజాజి పందిళ్ల కింద హాయిగా ఆ మధురిమలను ఆస్వాదిస్తోంది.ఇందుకోసం నేను సైతం అన్నట్లు కృషి చేస్తున్న వాళ్లలో మొట్టమొదటి స్థానం కస్తూరివిజయం వారిది. వారి యాజమాన్యానికి నా అభినందనలు. మరొక్కమాట-స్వర్ణ శిఖరాలు.ఈ నా కథాసంపుటిలోని కథలు చదివిన విజ్ఞులు ఎవరైనా నా కథలు అసలు బాగుండలేదని నాకు మెసేజ్ పెడితే... మీతో చర్చించి మీరు పుస్తకం ఎక్కడ కొన్నప్పటికీ నేను మీకు పుస్తకం రేటు రీఫండ్ చేయగలను..ఛాలెంజ్!! మీ --నల్లబాటి రాఘవేంద్రరావు