చెరువు స్థలం లో అక్రమంగా కట్టినందుకు స్కూల్ బిల్డింగ్ ను సీల్ చేసిన విషయం దేవయాని నమ్మలేకపోయింది. అంతకంటే ముఖ్యంగా నాన్న కలెక్షన్ లోంచి శతాబ్దాల నాటి విలువైన రాయిని ఫ్రెండ్స్ కు గొప్పగా చూపించడానికి స్కూలుకు తీసుకెళ్లి అక్కడ మర్చిపోయి వచ్చింది. ఇప్పుడు స్కూలుకు తాళం పడింది. రాయిని బయటకు ఎలా తేవాలా అని ఆలోచిస్తుండగానే వాటర్ రిసోర్స్ ఎక్స్పర్ట్ అయిన అమ్మ డా బృందా రత్నాకర్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద హంపి వెళుతూ పిల్లల్నీ తనతో తీసుకెళ్లింది. అక్కడ ఎవరో డా బృంద నోరు శాశ్వతంగా మూయించే పనిలో ఉన్నారని మన సీకర్స్ కి తెలిసింది. ఎవరిని నమ్మాలో తెలియని స్థితి. దేవయాని తమ్ముడు సారంగ్ కజిన్ నకుల్ ముగ్గురూ కలిస్తే సీకర్స్. అమ్మ చుట్టూ అల్లుకున్న పజిల్ ను సాల్వ్ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఏడు శతాబ్దాల నాటి విజయనగర సామ్రాజ్యంలో చిన్నారి శుభ ముందున్న సమస్య తుంగభద్ర ఆనకట్టను ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్న రాజద్రోహుల కుట్ర భగ్నం చెయ్యడం. శత్రువు ఎవరో తెలియని పరిస్థితి. వర్తమానంగతం మధ్య ఊపిరి సలపనివ్వకుండా నడిచే కథనంతో మిస్సింగ్ రాక్స్ ఆఫ్ హంపి నేటి సమస్యలకు గడిచిన చరిత్ర చూపించే పరిష్కారాలతో మిస్టరీ నవలలా చకచకా ముందుకు సాగి పోతుంది. ముగ్గురు చిచ్చరపిడుగులు హంపి రహస్యాలను వెలికితీస్తారా? ఆనకట్ట ను చిన్నారి శోభ కాపాడగలుగుతుందా? రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సాహసయాత్రకు స్వాగతం
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.