వేగంగా మారుతున్న ప్రపంచంలో బాగా ఆలోచించగలిగే నైపుణ్యం అనేది వరం. ఎప్పుడూ ఒక అభిప్రాయానికి లేదా ఒక ఆలోచనకు కట్టుబడకూడదు పునరాలోచించుకోవటానికి సిద్ధపడాలి అని ఈ పుస్తకం మనకు చెబుతుంది. చాలా మంది తమకు అసౌకర్యం కలిగించే ఆలోచనలు చేయటానికి భయపడతారు. తమ విశ్వాసాలనుఅభిప్రాయాలతో ఏకీభవించని వాళ్లకు దూరంగా మసలుతారు. ఒక పనిని తమకు అలవాటయిన పద్ధతిలో యాంత్రికంగా చేసుకుపోతారు. కొత్తగా ప్రయత్నించటానికి సందేహిస్తారు. ఒక పనిని నేర్చుకునే అవకాశంగా కాకుండా మన అహంకారానికి ముప్పుగా భావిస్తాం. దానితో నమ్మకాలు అనేవి పెళుసుగా తయారవుతాయి. కొత్తగా నేర్చుకోవటం ఆగిపోతుంది. నిరంతరం మన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి.. ఓ మత ప్రభోధకునిలా ఓ న్యాయవాదిగా ఓ రాజకీయవేత్తగా అవతారమెత్తుతాం. శాస్త్రవేత్తలా వ్యవహరించటానికి మాత్రం ఇష్టపడం. తమకు లభించే కొత్త దత్తాంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. తాము పొరపాటు అవకాశం ఉందనే వారి స్వభావం.. పునరాలోచనకు వారిని సిద్ధం చేస్తుంది. మీరు కూడా మీ వృత్తివ్యాపారాల్లో విజయం సాధించదలుచుకుంటే పునరాలోచన అన్న కళలో రాణించాలి. ఆ విద్య అలవడటానికి ఈ పుస్తకం మీరు తప్పక చదవితీరవలసిందే
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.