భిన్నంగా ఆలోచించు :మన ఆలోచనలే మన భవిష్యత్తు !ఆలోచన విత్తనం అయితే జీవితం ఆ విత్తనం నుండి వచ్చిన ఒక మహా వృక్షం !ఎలాంటి ఆలోచనలు వుంటే అలాంటి జీవితం!దుర్భరమైన ఆలోచనలు వుంటే దుర్భరమైన జీవితం!అందరిలా ఆలోచిస్తే అందరిలాంటి జీవితం!విభిన్నంగా ఆలోచిస్తే విభిన్నమైన జీవితం!కొత్తగా ఆలోచిస్తే కొత్త రకమైన జీవితం!ఆరోగ్యకర ఆలోచనలతో వుంటే ఆరోగ్యకర జీవితం!అద్భుతమైన ఆలోచనలతో వుంటే అద్భుతమైన జీవితం !శక్తివంతమైన ఆలోచలతో వుంటే శక్తివంతమైన జీవితం!మన ఆలోచనే మన జీవితం !తెలియకుండానే మన ఆలోచనలతో మనకు మనమే సృష్టించుకుంటున్న బాధనుండి బయటపడి ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా వుండటానికి కావలసిన ఆచరణాత్మక ఆలోచనా విధానాలతో కూడిన పుస్తకమే ' బిన్నంగా ఆలోచించు' !ప్రకృతి ఉమా మహేష్ గత 20 సంవత్సరాలకు పైగా దేశవ్యాప్తంగా తన ధ్యానఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఎన్నో లక్షల మంది జీవితాలను దుఃఖం నుండి ఆనందం వైపు నడిపించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త .తన వేల కొటేషన్స్ ద్వారా వందల కొద్ది యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపిన యువరచయిత మరి వక్త. ఆధ్యాత్మికత అంటే జీవన విధానానికి సంబంధించిన జీవితాన్ని మరింత అద్భుతంగా మరింత విజయవంతంగా మరింత హాయిగా మరింత సులభంగా ఆడుతూ పాడుతూ జీవించడానికి ఉపయోగపడే ఒక శాస్త్రమని ప్రబోధించే ఒక యువ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. వృత్తిపరంగా Persistent అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 20 సంవత్సరాల కార్పొరేట్ అనుభవం గల అనుభవజ్ఞుడు కూడా.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.